చంద్రబాబుతో భేటీ కోసం అమరావతి చేరుకున్న ఏవీ సుబ్బారెడ్డి.. ఆళ్లగడ్డలోనే ఉండిపోయిన అఖిల ప్రియ

  • ఆళ్లగడ్డ రాళ్లదాడి ఘటనపై టీడీపీ అధిష్ఠానం భేటీ
  • తనకు సమాచారం అందలేదని చెప్పిన అఖిలప్రియ
  • నిన్న కూడా భేటీకి హాజరు కాని ఏపీ మంత్రి
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డిపై కొంతమంది రాళ్లదాడి చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం గురించి మాట్లాడడానికి ఏపీ మంత్రి అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిలను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి రమ్మన్నారు. దీంతో ఇప్పటికే ఏవీ సుబ్బారెడ్డి అమరావతి చేరుకున్నారు. ఆళ్లగడ్డ రాళ్లదాడి ఘటనపై టీడీపీ అధిష్ఠానం ఆగ్రహంగా ఉన్నట్లు తెలిసింది. అయితే, ఈ సమావేశానికి సంబంధించి తనకు సమాచారం అందలేదని మంత్రి అఖిల ప్రియ ఆళ్లగడ్డలోనే ఉండిపోయారు.

కాగా, ఈ భేటీ నిన్న నిర్వహించాలని చూడగా.. తన తల్లి శోభా నాగిరెడ్డి వర్ధంతి సందర్భంగా తాను భేటీకి హాజరు కాలేనని అఖిలప్రియ నిన్న చెప్పిన విషయం తెలిసిందే.
Go Back to Shorts
akhila priya
Chandrababu
Andhra Pradesh

More Telugu News